ములకలపల్లి : మన ఊరు మన బడి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను సకల సౌకర్యాలతో ఆధునీకరించిన ఘనత ఒక్క మన ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. విద్యా దినోత్సవంలో భాగంగా మంగళవారం మన ఊరు మన బడి పథకం ద్వారా రూ.35 లక్షలతో ఆధునీకరించిన మండలంలోని పొగళ్ళపల్లి, ఒడ్డురామవరం ప్రభుత్వ పాఠశాలలను ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు.
అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల, కళాశాలలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పలు సాంసృతిక కళలను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విద్యార్థినులు ఈ సందర్భంగా తమ కళాప్రదర్శన ద్వారా వివరించగా ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కెజి నుంచి పిజి వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అన్ని వర్గాలకు అందిస్తున్న మహోన్నతమైన వ్యక్తి కెసిఆర్ ఒక్కరే అన్నారు. మనమంతా కెసిఆర్‌కు రుణపడి ఉన్నామన్నారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎను గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సునితా ఆధ్వర్యంలో అధ్యాపకులు శాలువుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మట్ల నాగమణి,జడ్‌పిటిసి సున్నం నాగమణి, ఎంపిటిసి శనగపాటి మెహర్మణి,సర్పంచ్ బీబినేని భద్రం, ఉప సర్పంచ్ శనగపాటి అంజి, ములకలపల్లి రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు శనగపాటి సీతారాములు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, ములకలపల్లి గ్రేటర్ వాసవీ క్లబ్ అధ్యక్షుడు, బిఆర్‌ఎస్ మండల నాయకులు బిక్కుమళ్ళ సుధాకర్, బిఆర్‌ఎస్ మండల నాయకులు నందమూరి సురేష్, పువ్వాల మంగపతి, పాలకుర్తి ప్రసాద్, డాక్టర్ బండి కొమరయ్య, పుష్పాల చందర్‌రావు, అడుసుమిల్లి రమణ, పామర్తి వెంకటేశ్వరరావు, కొండవీటి రాజారావు, పత్తీలాల్, ఎంఇఓ శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.