హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం హోలీని ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా భయంతో కొద్ది మంది మాత్రమే వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, నల్లగొండ జిల్లాలో ప్రజలు రంగులు చల్లుకుంటూ ఈ వేడుకలను జరుపుకున్నారు. చిన్నా, పెద్దా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో చాలా మంది హోలీకి దూరంగా ఉండగా, కొద్దిమంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలెవరూ గూమిగూడొద్దని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించిన నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించడంతో పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా హోలీ వేడుకలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -