నిరసనలో పాల్గొన్న రాహుల్ , ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంటు వద్ద గురువారం అదానీ ‘ఇండిక్ట్ మెంట్’ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీలు విన్నూత్న నిరసన ప్రదర్శించారు. ‘మోడీ-అదానీ ఏక్ హై’ అని రాసి ఉన్న జాకెట్లు ధరించి మరీ నిరసన ప్రదర్శించారు. గౌతమ్ అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. గౌతమ్ అదానీతో పాటు, అతడి మేనల్లుడిని కూడా అమెరికా ప్రాసిక్యూటర్లు మోసగించిన అభియోగాలపై అపరాధులని తేల్చారు.
ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా బ్లాక్ హాఫ్ జాకెట్లను ధరించి మరీ నిరసన ప్రదర్శించారు. వారంతా గురువారం పార్లమెంటు కాంప్లెక్స్ లో ఈ నిరసన చేపట్టారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘ మోడీ, అదానీపై దర్యాప్తు జరపనివ్వడు, ఒకవేళ దర్యాప్తు జరగనిస్తే ఆయన మీద కూడా దర్యాప్తు జరగొచ్చు… మోదీ, అదానీ ఒక్కటే(మోడీ, అదానీ ఏక్ హై) ’’ అని వివరించారు.
#WATCH | Delhi: Opposition MPs wear jackets symbolising their protest over the Adani issue and stage a demonstration at the Parliament premises. pic.twitter.com/hJrAYkNzPv
— ANI (@ANI) December 5, 2024