Sunday, December 22, 2024

దేశంలో మోడీ, అంబానీ ట్యాక్స్ నడుస్తోంది

- Advertisement -
- Advertisement -

అవినీతి విషయంలో దేశంలో ఉన్న అన్ని పతకాలు ఎన్డీఏకే ఇవ్వాలి
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: తెలంగాణలో ఆర్‌ఆర్ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ నడుస్తోందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ కాదు దేశంలో మోడీ, అంబానీ ట్యాక్స్ నడుస్తోందని ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్న మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. అవినీతిలో దేశంలో ఉన్న అన్ని పతకాలు ఎన్డీఏకే ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాలేదు అప్పుడే మాపైన ఆరోపణలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తున్నామన్నారు. కాగా, ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ఢిల్లీకి ఏటిఎంగా మారిందని, రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News