Monday, December 23, 2024

బంగ్లాదేశ్‌కు డీజిల్ పైప్‌లైన్ ప్రారంభించిన మోడీ, హసీనా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా శనివారం రూ. 377 కోట్ల డీజిల్ సరఫరా పైప్‌లైన్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఈ పైప్‌లైన్ భారత్ నుంచి ఉత్తర బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. దీని వల్ల ఖర్చు చాలా వరకు ఆదా అవుతుంది. ఈ పైపులైన్‌తో భారత, బంగ్లాదేశ్‌ల మధ్య ఓ కొత్త అధ్యాయం మొదలు కానున్నది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు 512 కిమీ. రైలు మార్గం ద్వారా డీజిల్ సరఫరా అవుతోంది. ఇప్పుడు 131.5 కిమీ. కొత్త పైప్‌లైన్ ద్వారా ఒక మిలియన్ టన్ను డీజిల్ సరఫరా కానున్నది. ఈ డీజిల్ అస్సాంలోని నూమలిగఢ్ నుంచి బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. దీని ద్వారా రవాణా ఖర్చు చాలా వరకు తగ్గనున్నది. కర్బన కాలుష్యం కూడా చాలా వరకు తగ్గనున్నది.

భారత, బంగ్లాదేశ్‌ల మధ్య నిర్మించిన ఈ పైప్‌లైన్ నిర్మాణం 2018 లో మొదలయింది. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 377 కాగా, అందులో బంగ్లాదేశ్ ఖర్చు రూ. 285. భారత ప్రభుత్వం గ్రాంట్ సాయాన్ని అందించింది. సిలిగురి నుంచి ఈ పైప్‌లైన్ మొదలవుతుంది. నూమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్(ఎన్‌ఆర్‌ఎల్) నుంచి బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్(బిపిసి) పర్బతీపూర్ డిపోకు సరఫరా చేరుకుంటుంది. రెండు దేశాల నుడుమ కుదిరిన ఈ ఇంధన రవాణ డీల్ 15 ఏళ్లపాటు ఉండనున్నది. దశల వారీగా దీనిని విస్తృతం చేసే అంగీకారాన్ని కూడా రెండు దేశాలు కుదుర్చుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News