Tuesday, December 24, 2024

మోడీ, అమిత్ షా మమ్మల్ని మౌనంగా ఉంచాలనుకుంటున్నారు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, ప్రతిపక్షాలపై ఒత్తిడి(ప్రెషర్ ట్యాక్టీస్) తెచ్చి, మమ్మల్ని మౌనంగా ఉండిపోయేలా చేయాలనుకుంటున్నారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) ఆయనని దాదాపు 50 గంటలపాటు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాహుల్ తల్లి సోనియా గాంధీని కూడా ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో ఈడి విచారించింది. ‘‘నేషనల్ హెరాల్డ్ కేసు విషయాన్ని మీరు ప్రస్తావిస్తే, నేను చెప్పేదొక్కటే…అది కేవలం మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకోడానికి వేసిన ఎత్తుగడ. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రజాస్వామా్యనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ మేము మాత్రం మా వైఖరికే కట్టుబడి ఉంటాం. నేను ప్రజాస్వామ్యపరిరక్షణకు, సామరస్యాన్ని కాపాడడానికి కట్టుబడి ఉన్నాను’’ అని రాహుల్ గాంధీ విలేకరులకు తెలిపారు. బిజెపి నాయకుడు సుబ్రమణ్యన్ స్వామి ఢిల్లీ హైకోర్టులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ ఆస్తుల కేసును దాఖలు చేయడంతో వారు కేసులో ఇరుక్కున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాడానికి ఏమి పాటుపడడంలేదని, కేవలం తన రూ. 2000కోట్ల ఆస్తిిని కాపడడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారంటూ బిజెపి విమర్శిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News