హైదరాబాద్: ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెచ్‌ఐసిసికి మోడీబయలుదేరారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రాత్రికి నోవాటెల్‌లో ప్రధాని బస చేయనున్నారు.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, జాతీయ నేతలు హాజరయ్యారు.ప్రధానికి స్వాగతం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికానన్నారు. ముఖ్యమంత్రి తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. గతంలో మోడీ వచ్చినప్పుడు కెసిఆర్ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టిఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. బిజెపి జాతీయ నేతలు హైదరాబాద్ అభివృద్ధి చూడాలని తలసాని అన్నారు.