Monday, December 23, 2024

ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలు.. ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని హాజరు కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు జులై 13, 14 తేదీల్లో మోడీ అక్కడ పర్యటిస్తారు. ఐరోపా లోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఫాన్స్ నేషనల్ డే పరేడ్ జులై 14న పారిస్‌లో జరుగుతుంది. ఆ పరేడ్‌లో మోడీ పాల్గొంటారు. అందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటాయి.

ప్రధాని గౌరవార్ధం ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికారిక విందుతోపాటు ప్రైవేట్ విందును కూడా ఇవ్వనున్నారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ ప్రధానితోపాటు సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుల తోనూ భేటీ అవుతారు. అనంతరం అక్కడి ప్రవాసి భారతీయులు, భారత్, ఫ్రెంచి సంస్థల సీఈవోలు, ఇతర ప్రముఖులతోనూ మోడీ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

తిరుగు ప్రయాణంలో మోడీ జులై 15న యూఏఈలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్‌టెక్, రక్షణ, సాంస్కృతిక విభాగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News