Thursday, January 23, 2025

సిబిఐ కీలు బొమ్మ… ఇడి తోలు బొమ్మ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌సి కవితకు ఇడి నోటీసులు పంపించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కవితకు పంపినవి ఇడి సమన్లు కాదని మోడీ సమన్లు అని ఎద్దేవా చేశారు. మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అయితే ఝుమ్లా లేకపోతే హమ్లాలాగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక ప్రహసనంగా నడుస్తోందని, బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలపై ఐటి, సిబిఐ, ఇడి దాడులు చేసిందని, 12 మంది నేతలపై ఐటి, ఇడి, సిబిఐ సంస్థలను ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీ ప్రధాని నరేంద్ర మోడీకి బినామీ అని అందరికీ తెలుసునన్నారు. కేంద్రం చేతిలో సిబిఐ కీలు బొమ్మ, ఇడి తోలు బొమ్మగా మారిందన్నారు.

అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు ఇవ్వడం చట్టం విరుద్ధమని నీతి ఆయోగ్ తెలిపిందని గుర్తు చేశారు. అయినప్పటికీ అదానీ కోసం నిబంధనలు ఉల్లంఘించారని దుయ్యబట్టారు. ముంద్రా పోర్టులో రూ.20 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడితే ఏం చేశారని ప్రశ్నించారు. అవీనితి పాలనకు మారు పేరుగా కేంద్రం తీరు ఉందని ఎద్దేవా చేశారు. జి2జి అంటే గౌతమ్ టు గొటబాయా ఫెసిలిటేటెడ్ బై మోడీగా మారిందన్నారు. ఇడి చేస్తున్న దాడులు వంద శాతం విపక్షాల మీదనే జరిగాయన్నారు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తేందుకు ప్రయత్నంచేస్తుందని విరుచుకపడ్డారు.

అదానీ పోర్టుల్లో హెరాయిన్ దొరికినా కేసు పెట్టరని, డబుల్ ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ మోడీ, మరో ఇంజిన్ అదానీనా? అని చురకలంటించారు. బిబిసి మీద దాడి చేసిన వాళ్లకు భారత్ మీడియా ఒక లెక్కానా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఎవరినైనా ఉతికి ఆరేస్తానని మోడీ అంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని చంపేసేందుకు ఇడి దాడులు చేయడం ఏంటని అడిగారు. హిండెన్ బర్గ్ నివేదికలు ఇచ్చినా ప్రధాని స్పందించరా? అని అడిగారు. మునుగోడు ఒక వ్యక్తికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టలేదా? కెటిఆర్ ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హిమంత బిశ్వశర్మపై పెట్టిన కేసులు ఏమయ్యాయని అడిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News