Thursday, January 23, 2025

నటుడి కుమార్తె  పెళ్లికి  హాజరైన ప్రధాని మోదీ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె  వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న మోదీ కోచ్చిలో రోడ్డు షో నిర్వహించిన  అనంతరం నేరుగా ఆలయానికి వచ్చి, వధూవరులను ఆశీర్వదించారు. వారిద్దరికీ స్వయంగా మోదీ వరమాలలు అందించారు. అదే ఆలయంలో వివాహం జరుపుకుంటున్న మరో 30 జంటలకు కూడా మోదీ ఆశీర్వచనాలు అందజేశారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ తోపాటు మలయాళ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు కూడా సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News