Wednesday, January 22, 2025

మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిఎం మోడీ రాజకీయ ప్రస్థానం ఒక అద్భుతం అని కొనియాడారు. భారతదేశ శక్తిసామర్ధ్యాలకు, భారతీయతలోని గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రాచుర్యం కలిగించిన వారిలో నరేంద్ర మోడీ అగ్రగణ్యులన్నారు. సెప్టెంబర్ 17న మోడీ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాన్ తన ట్విట్టర్ లో పిఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలో ప్రభల ఆర్థిక శక్తిగా రూపొందించే సంకల్పంతో ఆయన వడివడిగా వేస్తున్న అడుగులు ప్రశంసనీయమని పవన్ పేర్కొన్నారు.  అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించడం అంటే గొప్ప విషయమని మెచ్చుకున్నారు. వరుసగా పుష్కర కాలానికిపైగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరుసగా మరో మూడు పర్యాయాలు అఖండ భారతావనికి ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం ‘న భూతో న భవిష్యతి’ అని జనసేనాని ప్రశంసించారు. అటువంటి గొప్ప రాజకీయ మానవతావాది నాయకత్వంలోని ఎన్ డిఎలో తాను సైతం భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మోదీ చిరంతనంగా ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని, ఆ సర్వేశ్వరుడు ఆయనకు ఆరోగ్యంతో కూడిన చిరాయువును ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News