Wednesday, January 22, 2025

దేశ భక్తులకు జైలు.. ఆర్థిక నేరస్థుడికి మోడీ ఆశీస్సులు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన క్యాబినెట్‌లోని మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి దేశభక్తులను జైళ్లకు పంపి ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఆర్థిక నష్టాన్ని చేకూర్చిన వ్యాపార దిగ్గజాలకు సన్నిహితంగా మెలుగుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మంగళశారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జుడిషయల్ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కోసం ప్రార్థించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత దేశం విద్యా, ఆరోగ్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి నిజమైన దేశభక్తులను చూసిందని కేజ్రీవాల్ అన్నారు. దేశ భక్తులను జైళ్లలో పెట్టి ఒక నేరస్థుడికి ప్రధాని మోడీ కొమ్ముకాయడం ఆఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.

హోలీ రోజును ధ్యానం చేయడానికి, దేశం కోసం ప్రార్థించడానికి అంకితం చేస్తున్నానని ఆయన తెలిపారు. దేశం ఆందోళనకర పరిస్థితికి చేరుకుందని మీరు కూడా భావిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ తప్పు చేస్తున్నారని నమ్మితే మీరు కూడా నాతో పాలుపంచుకోండి అంటూ ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News