మోడీ 3.0 ప్రభుత్వంలో
తొలి పద్దును ప్రవేశపెట్టనున్న
ఆర్థికశాఖ మంత్రి నిర్మల
ఈ నెల 22 నుంచి ఆగస్టు
12వరకు కొనసాగనున్న
పార్లమెంట్ సమావేశాలు
ఈసారి వేతన జీవులకు
బడ్జెట్‌లో ఊరట లభించే
అవకాశం గృహ రుణాలపై
పన్ను రాయితీ వంట
గ్యాస్ సహా నిత్యావసరాలపై
సబ్సిడీలు
న్యూఢిల్లీ : ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ స మావేశాలు ప్రారంభం కానున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొ నసాగనున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్రమో డీ 3.0 కేబినెట్‌లో తొలి బడ్జెట్‌ను ఈ నెల 23న ప్రవేశ పెట్టనుంది. 202425 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పె ట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవ రి 1న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్టు అప్పట్లోనే వెల్లడించారు.
ఎ ప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉ న్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకువచ్చే కొత్త సంప్రదాయానికి నిర్మలాసీతారామ న్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీతారామ న్ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన ఆమె 2024 25 బడ్జెట్‌ను సమర్పించనున్నారు అయితే వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయని అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ ఆనాడు వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టగా, ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెడితే వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన రికార్డు సృష్టించినవారవుతారు. ప్రధాని మో డీ మొదటి దఫా మంత్రివర్గంలో 2014లో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి మోడీ ప్రభుత్వం వచ్చాక అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను నిర్మలాసీతారామన్ చేపట్టారు. నాటి నుంచి దేశీయ ఆర్థిక రం గంలో మలివిడత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూ డోసారి చోటు దక్కించుకున్న ఘనత సీతారామన్‌దే. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున ఈసారి బడ్జెట్ సామాజిక, ఆర్థిక నిర్ణయాలతో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకునేదిగా నిలుస్తుందని ముందుగా అంచనా వేసి చెప్పారు.
బడ్జెట్‌పై ఊహాగానాలు
ఈసారి బడ్జెట్‌లో వేతన జీవులకు ఆదాయం ప న్ను భారం చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.50 వేలకు ఆదాయం ప న్ను విధిస్తుండగా, ఈ పరిధి 50వేల నుంచి రూ. లక్షవరకు పెరుగుతుందని అనుకుంటున్నారు. అలాగే గృహ రుణాలకు సంబంధించి కూడా సెక్షన్ 24(బి) కింద పన్నురాయితీ లభించే అవకాశం కనిపిస్తోంది. మహిళల సంక్షేమం ఆశించి వంటగ్యాస్ వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు మరింతగా లభిస్తాయి. అలాగే ఆరోగ్యభద్రతకు సంబంధించిన అవసరాల ధరల్లో డిస్కౌంట్ లభిస్తుంది.
పొదుపు ఖాతాల వడ్డీపై ఆదాయం ప న్ను మినహాయింపు రూ.10వేల నుంచి రూ. 25 వేల వరకు పెరగనుంది. ఈ మినహాయింపు సీనియర్ సిటిజన్లకు రూ. 50,000 వరకు లభిస్తుం ది. మౌలిక సదుపాయాల కల్పనకు విశేష ప్రాధా న్యం కల్పించనున్నారు. రక్షణ, రైల్వే, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాలకు ప్రాధాన్యం క ల్పిస్తారు. వాణిజ్య రంగంలో సులువుగా వ్యాపారాలు సాగేందుకు దాదాపు 100 చట్టపరమైన ని బంధనలు సడలిస్తారు. జరీమానాల వంటివి త గ్గుతాయి. ఫలితంగా కోర్టుల్లో కేసుల భారం చా లావరకు తగ్గే వీలుంటుంది. ఈమేరకు మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అనే వ్యవస్థను రూపొందించడానికి కేంద్రం ఆలోచిస్తోంది. వాణిజ్య రంగంలో తలెత్తిన కేసుల భారం కోర్టుల్లో తగ్గుతుంది. వ్యాపారాలు పురోగతి చెందే మార్గం ఏర్పడుతుంది.