Monday, January 20, 2025

బెర్త్‌లపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు
దక్కే అవకాశం రాష్ట్రం నుంచి ఇద్దరు
బిజెపి ఎంపిలకు కేబినేట్ పదవి కిషన్‌రెడ్డి,
బండి సంజయ్‌లకు చోటు లభిస్తుందంటూ
జాతీయ మీడియా కథనాలు ఈటల,
డికె అరుణకు స్థానం కల్పిస్తారంటూ ఊహాగానాలు
టిడిపి నుంచి ఇద్దరికి అవకాశం రామ్మోహన్
నాయుడు, పెమ్మసానికి మంత్రి పదవులు
జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పేరు ఖరారు
బిజెపి సారథి జెపి నడ్డాకు మంత్రి పదవి ఖాయం
రేసులో శివరాజ్, సోనోవాల్, ఖట్టర్, బస్వరాజ్

మన తెలంగాణ/హైదరాబాద్/న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువుదీరనున్న మోడీ నాయకత్వంలోని ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గం కూ ర్పుపై కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఎన్‌డిఎలో కీలక భాగస్వా మ్య పక్షాలైన టిడిపి, జెడి(యు), జనసేన, శివసేన తదితర పక్షాల అధినేతలతో మంత్రి పదవుల పంపకాలపై అవగాహన కుదిరినట్లు సమాచా రం. వీరితో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, అమిత్ రాజ్‌నా థ్ సింగ్ సంప్రదింపులు జరిపారు. హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ, వి ద్యా, సాంస్కృతికం తదితర కీలక శాఖలతో పాటు పటిష్ట్ట సైద్ధాంతిక భావజాలంతో కూడిన మరో రెండు శాఖలు బిజెపి తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ శాఖలకు సీనియర్లతో పాటు కొత్తగా లో క్‌సభకు ఎన్నికైన మాజీ సిఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, బస్వరాజ్ బొ మ్మై, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద పోటీ పడుతున్నా రు. మరోవైపు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన టిడిపికి నాలుగు, జనతాదళ్ యునైటెడ్‌కు రెండు బెర్త్‌లు, జనసేన, ఎల్‌జెపికు ఒకటి ఖరారు అ యినట్లు సమాచారం. టిడిపి నుంచి ఎంపిలు రాంమోహన్ నాయుడు(శ్రీకాకుళం), హరీశ్ బాలయోగి(అమలాపురం), దగ్గుమల్ల ప్రసాద్(చిత్తూరు), పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపుగా ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు టిడిపికి రెండు మంత్రి పదవులే దక్కనున్నాయని హస్తినలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ రెండింటిలో రాంమోహన్ నాయుడుకు కేబినెట్ హోదా, పెమ్మసానికి సహాయ హోదా ఇవ్వనున్నారని తెలిసింది. ఇక జెడియు నుంచి సీనియర్ ఎంపిలు లలన్ సింగ్, రాంనాథ్ ఠాకూర్, సంజయ్ ఝా పేర్లను నితీశ్ కుమార్ ప్రతిపాదించినట్లు సమాచారం. రాంనాథ్ ఠాకూర్ దివంగత కర్పూరీ ఠాకూర్ కుమారుడు.

ఇటీవల మోడీ ప్రభుత్వం ఆయనకు మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. అయితే సంజయ్ ఝా, ఠాకూర్‌లలో ఎవరో ఒకరికి మాత్రమే పదవి దక్కే అవకాశాలు కనిపిస్తునాయి. ఇక జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. లోక్‌జనశక్తి(రాంవిలాస్) పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్‌కు కేబినెట్ హోదాతో కూడిన మంత్రి పదవి దక్కనుంది. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని బిజెపి యోచిస్తోంది. వీటిలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగనుండగా, బీహార్‌లో వచ్చే ఏడాది జరగనున్నాయి. తిరిగి ఈ రాష్ట్రాల్లో ఎన్‌డిఎ పాగా వేయాలంటే ఆయా రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం తప్పనిసరి అని కమలం పార్టీ హైకమాండ్ వ్యూహంగా ఉంది.

తెలంగాణ నుంచి ఎవరికి దక్కేను..?

మరోవైపు తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మల్కాజిగిరి నుంచి ఎన్నికైన సీనియర్ నేత ఈటల రాజేందర్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. కేబినెట్‌లో వీరికి దాదాపుగా చోటు దక్కినట్లు సమాచారం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి మరోసారి ఎన్నికైన బండి సంజయ్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ నుంచి ఈ సారి బిజెపి 8 స్థానాలు గెలుచుకుంది. తెలుస్తోంది.

ఒక ఎంపీకి కేబినెట్ హోదాలో, మరొకరికి రాష్ట్ర మంత్రిగా స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో ఒక వేళ చోటు దక్కకపోతే, అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన బిజెపి పార్లమెంటరీ బోర్డులో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బిసి వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కు మంత్రి పదవి ఇచ్చి బిసిలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని పార్టీ భావిస్తోంది. ఇదిలావుంటే మంత్రి పదవుల రేస్‌లో నిజామాబాద్ ఎం పీ ధర్మపురి అరవింద్, బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మహబూబ్‌నగర్ ఎంపి డికె అరు ణ మహిళ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపి స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో బిజె పి జెండా పాతిన ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రె డ్డి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు సమాచారం.

కాగా ఛాలెంజింగ్‌గా మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘునందన్‌రావుకు కేంద్ర మంత్రి పదవి కాకుండా రాష్ట్ర పార్టీ అధ్య క్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఊహాగాలన్నింటికి 9వ తేదీ ఆదివారం తెరపడుతుంది. ఇదిలావుంటే బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన జెపి నడ్డాను సైతం కేబినెట్‌లోకి తీసుకుని ఆ పదవిలో మ రో సీనియర్ నేతను కూర్చోబెట్టే యోచనలో బిజెపి ఉంది. ఇక వెనుకబడిన తరగతులతో పాటు ఎస్‌సి, ఎస్‌టిలకు మంత్రివర్గంలో సముచి త స్థానం కల్పిస్తామని ప్రచారం సందర్భంగా మోడీ పదేపదే చెప్పారు. ఆ దిశగా కూడా కమలం నేతలు మేథోమధనం జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News