Monday, December 23, 2024

అవినీతిని నిర్మూలిస్తేనే సామాన్యుడికి జీవితం: ప్రధాని

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: చెదపురుగులను తుదముట్టిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అవినీతి, వారసత్వాలను జనజీవనం నుంచి తరిమేద్దామని పిలుపునిచ్చారు. అవినీతిని నిర్మూలిస్తేనే సామాన్యుడి జీవితం మెరుగవుతుందని, దేశ వ్యాప్తంగా అవినీతిపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. అవినీతిపరులపై క్షమ కూడా కనిపిస్తోందని, అవినీతిపరులను క్షమిస్తే అభివృద్ధికి ఆటంకమని, అవినీతి, అవినీతిపరుల విషయంలో జాగృతం కావాలన్నారు. అవినీతిపరులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. వారసత్వంపై మాట్లాడితే రాజకీయ భావనగా విమర్శిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి వారసత్వం విఘాతం కలిగిస్తుందని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News