Wednesday, January 22, 2025

హిమాచల్‌లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు

- Advertisement -
- Advertisement -

లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు హిమాలయాల్లా సరిహద్దుల్లో దృఢంగా ఉన్నంతవరకు భారత్ సురక్షితంగా ఉంటుంది. సైనిక బలగాలు ఎన్నో సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించాయి. పండగ వేళ కుటుంబానికి దూరంగా, సరిహద్దుల్లో విధులు నిర్వహించడం, మీ నిబద్ధతకు నిదర్శనం. భారత భద్రతా బలగాలు పనిచేస్తున్న చోటు నాకు దేవాలయంతో సమానం” అని ప్రధాని మోడీ చెప్పారు.

ఈ సందర్భంగా భద్రతా బలగాలు వివిధ దేశాల్లో నిర్వహించిన రెస్కూ ఆపరేషన్లను ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “సూడాన్ నుంచి భారతీయులను తీసుకువచ్చే మిషన్‌ను సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. టర్కీలో భూకంపం సంభవించినప్పుడు భారత బలగాలు ఎంతో ధైర్యసాహసాలతో సహాయక చర్యలు చేపట్టి అక్కడి ప్రజలను కాపాడాయి. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది” అని ప్రధాని మోడీ అన్నారు.

2014లో అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోడీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. సైనికులతో ముచ్చటించి వారికి స్వీట్లు పంచి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గత ఏడాది కార్గిల్‌లో వేడుకలు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News