తప్పుడు విధానాలతో తెలంగాణ రైతుకు రూ.9,555 కోట్ల నష్టం
అవసరాలకు మించి పండిస్తున్నా ఆదరణ ఏదీ
కొనుగోళ్ల ఏటా మోడీ సర్కారుపై పోరాటమేనా?
జాతీయ వ్యవసాయ విధానాలపై సర్వత్రా విమర్శలు
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో ఆరుగాలం చెమటోడుస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చకపోగా, కనీస మద్దతు ధరల విషయంలో కూడా రైతులను నిలువునా వంచనకు గురిచేస్తోంది. 2022 వ్యవసాయ ఉత్పత్తులకు రెట్టింపు ఆదాయం వర్తింప చేస్తామని ప్రధాని నరేంద్ర రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేపోయారు. పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరల ప్రకటనలో కూడా కేంద్రం చేసిన మోసపూరిత వైఖరి వల్ల తెలంగాణ ధాన్యం రైతులు రూ.9550 నష్టపోవాల్సి వచ్చింది. పంటలకు మద్దతు ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల పట్ల రైతులు, రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి.
రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా రైతుల నుంచి 2022 వానాకాలం 55 లక్షల టన్నులు, యాసంగి సీజన్‌లో 65 లక్షల టన్నులు కలిపి సుమారు సుమారు కోటీ 10 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఈ ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి బహిరంగ మా ర్కెట్‌లో అమ్మాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ని ర్ణయించింది. ధాన్యం అమ్మకం ధర ఇంకా నిర్ణయించలేదు కానీ, ఆవైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. సిఎపిసి సంస్థ అంచనా ప్రకారం రా ష్ట్రంలో 2022 23లో క్వింటాల్ ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) రూ.1877గా ఉంది.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార సు ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే, తెలంగాణ రైతులకు క్వింటాల్‌కు రూ.2815 మద్దతు ధర అంది వుండేది.. కానీ ఈ సిఫారసును అమలు చేయకుండా, 2022లో కేంద్ర ప్ర భుత్వం ధాన్యానికి ప్రకటించిన కనీస మద్దతు ధ ర క్వింటాలుకు రూ.2060 మాత్రమే అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగాప్రతి క్వింటాల్‌పై తెలంగాణ రైతాంగం రూ.755 నష్ట పోయింది. అంటే గత రెండు సీజన్లలో రాష్ట్రం సేకరించి, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో అమ్మాలనుకుంటున్న కోటి టన్నుల ధాన్యంపై రైతులు నష్ట పోయింది కోట్లుగా రైతు స్వరాజ్య వే దిక కన్వీనర్ కన్నెగంటి రవి విశ్లేషించారు. ఒక ఎకరం వరి ధాన్యం పండించే రైతుకు నికర నష్టం రూ.18,120గా స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలో కూడా కోతలు పడ్డాయి. తేమ ఎక్కువుందనే పేరుతో, ధాన్యం నల్లబడి నా ణ్యత లేదనే పేరుతో ప్రతి క్వింటాల్‌పైన గరిష్టంగా 10 శాతం వరకూ కోతలు పడ్డాయంటున్నారు.
ఫలితంగా పలు చోట్ల రైతులకు ప్రతి క్వింటాలుకు నికరంగా దక్కిన ధర రూ. 1800 నుంచి -రూ.1900 మించలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో కోటి టన్నుల సేకరణలో క్వింటాల్‌కు రూ.200 చొప్పున రైతులకు జరిగిన నష్టం రూ.2000 కోట్లుగా, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో చేసిన మోసం వల్ల రైతులు మొత్తం కోటి టన్నులపైన ధరల్లో వ్యత్యాసం వల్ల రూ. 9550 కోట్ల నష్టపోయినట్టు రైతు స్వరాజ్యవేదిక అంచనా వేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంస్థ ప్రతి మనిషికి ఆరోగ్యం కోసం రోజుకు నాలుగు వందల గ్రాముల ఆహార ధాన్యాలు అవసరమని సిఫారసు చేసింది. నెలకు 12 కిలోలు సరిపోతాయని అంచ నా వేసింది. ఇందులో సగం ( 6 కిలోలు) రేషన్ కార్డులపై బియ్యంగా సరఫరా చేసినా, మిగిలిన సగం జొన్నలు, ఇతర చిరు ధాన్యాల రూపంలో తక్కువ ధరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయవచ్చు.
రైతులను చిరు ధాన్యాల పంటల సాగువైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంది. చిరుధాన్య రైతుల నుంచి సేకరించడానికి ఆహార భద్రత చట్టం కింద కేంద్రం అనుమతించి, ఆర్థ్ధికంగా కూడా సహకరిచాల్సి ఉంది. దీనివల్ల కేవలం వరి ధాన్యం పండించే రైతులకే కాకుండా , చిరు ధాన్యాలు పండించే రైతులకు కూడా కనీస మద్దతు ధరలు దక్కే అవకాశం కలగనుంది. పప్పు ధాన్యాలను, నూనె గింజలను కూడా రైతుల నుంచి మద్దతు ధరలకు సేకరించి ప్రజలకు తక్కువ ధరలకు సరఫరా చేసే అవకాశం కలగనుంది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం బియ్యం తప్ప మరే ఇతర ధాన్యపు గింజలను ప్రజలకు పంపిణీ చేయకపోవడంతో ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం 121 దేశాల్లో 107వ స్థానంలో చేరిపోయింది. ప్రజలకు అవసరమైన పౌష్టిక ఆహారం దొరకక పోవడం వల్ల, మహిళలలో, పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 వ రౌండ్ నివేదిక కూడా బయట పెట్టింది. 15-49 సంవత్సరాల మధ్య వయస్సు గర్భిణీ స్త్రీలలో 53.2 శాతం మంది, 15-49 సంవత్సరాల మొత్తం మహిళలలో 57.6 శాతం మంది మహిళలు రక్త హీనత తో బాధ పడుతున్నారని ఈ నివేదిక బయట పెట్టింది. ప్రజలకు కడుపు నిండా పౌష్టిక ఆహారం లభించటం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అవసరాలకు మించి పండిస్తున్నా ఆదరణ ఏది?
రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుకు వెనుకాడకుండా కృష్ణగోదావరి నదుల పరివాహకంగా పాలమూరురంగారెడ్డి , కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది. తెలంగాణ రైతాం గం కూడా ఆరుగాలం చెమటోడుస్తు రాష్ట్ర అవసరాలకు మించి ధాన్యం పండించి దేశీయ అవసరాలకు అందజేస్తున్నారు. భారత ఆహార సంస్థకు ఏటా తెలగాణ నుంచే అత్యధికశాతం ధాన్యం అందుతోంది. ఇంత చేస్తు న్నా రైతుకు తగిన ప్రోత్సాహం, సహకారం లభించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం ఇంత ఖర్చు పెట్టి మన అవసరాలకు మించి, వరిని పండించాల్సిన అవసరం ఉం దా? ఒక మనిషికి నెలకు 12 కిలోలు, సంవత్సరానికి 144 కిలోలు బి య్యం అవసరం. వలస కార్మికులతో సహా, రాష్ట్రంలో నాలుగు కోట్ల మం ది ఉన్నారనుకుంటే సంవత్సరానికి 57,60,000 టన్నుల బియ్యం కావాలి.
ఇందుకు అవసరమైన ధాన్యం ఎకరానికి 24 క్వింటాళ్ల దిగుబడి చొప్పు న సుమారు 86,40,000 టన్నులు. ఈ ధాన్యం పండించడానికి సంవత్సరానికి అవసరమైన సాగు భూమి కేవలం 36 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ ధాన్యం రెండు సీజన్ ల లోనూ పండించుకునే అవకాశం ఉంది . ప్రతి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంతో పోరాటం చే యాల్సి కేంద్రం ఇప్పటికైనా వ్యవసాయరంగంలో రైతు అనుకూ ల విధానాలతో కనీస మద్దతు ధరలను అమలు చేయాల్సిన అవసరం ఉం దని రైతులు, మోడీ సర్కానును డిమాండ్ చేస్తున్నాయి.