అవి బంధుప్రీతి పాటించాయి
వారణాసిపై శీతకన్ను వేశాయి
ప్రధాని మోడీ నిశిత విమర్శ
కాశీలో రూ. 6700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
వారణాసి (యుపి) : కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) బంధు ప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు పాటించాయని, వారణాసి అభివృద్ధిపై అవి శీతకన్ను వేసేంతగా అవి సాగాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు. పది సంవత్సరాల క్రితం వరకు కోట్లాది రూపాయలు విలువ చేసే కుంభకోణాలు పతాక శీర్షికలు ఎక్కుతుండేవని ప్రధాని మోడీ ఆరోపిస్తూ, ‘కానీ ఇప్పుడు అలా జరగడం లేదు’ అని చెప్పారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో రూ. 7600 కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన తరువాత సమావేశంలో మోడీ ఆ ఆరోపణలు చేశారు.
‘కాశీని అభివృద్ధికి దూరం చేసిన మనస్తత్వం ఏమిటి? పది సంవత్సరాల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకోండి. అభివృద్ధి కోసం వారణాసి పాకులాడవలసి వస్తుండేది’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో దీర్ఘ కాలం, ఢిల్లీలో దశాబ్దాల తరబడి ప్రభుత్వాన్ని పాలించినవారు వారణాసి పట్ల ఎందుకు శ్రద్ధ వహించలేదు? అందుకు సమాధానం బంధుప్రీతి, సంతుష్టి రాజకీయాలు’ అని ఆయన ఆరోపించారు. ‘సమాజ్‌వాది పార్టీ కానీయండి, కాంగ్రెస్ కానీయండి వారణాసి అభివృద్ధి వారికి ప్రాథమ్యం కాదు, భవిష్యత్తులో కూడా కాబోదు. ‘సబ్‌కా వికాస్’ సిద్ధాంతంపై బిజెపి ప్రభుత్వం నడుస్తోంది’ అని మోడీ చెప్పారు. ‘ఇప్పుడు కేవలం 125 రోజుల్లో రూ. 15 లక్షల కోట్లు విలువ చేసే పని ప్రారంభం గురించి ప్రతి ఇంటిలో చర్చించుకుంటున్నారు’ అని ఆయన తెలిపారు.
తన ప్రభుత్వానికి రెండు పెద్ద లక్షాలు ఉన్నాయని, అవి ప్రజల సౌకర్యం పెంచడం, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం’ అని మోడీ తెలియజేశారు. ‘ప్రస్తుతం దేశంలో కొత్త రహదారులు నిర్మాణం జరుగుతోంది, కొత్త రూట్లలో రైలు మార్గాలు వేస్తున్నారు, కొత్త విమానాశ్రయాలు నిర్మితం అవుతున్నాయి. ఇది కేవలం రాయి, ఇనుము పని కాదు, కానీ ప్రజల సౌకర్యం పెంచడం, యువతకు ఉద్యోగాలు సృష్టించడం’ అని ప్రధాని చెప్పారు. వారణాపిలోని సిగ్రా క్రీడా సముదాయం నుంచి రూ. 6700 కోట్లు విలువ చేసే అభివృద్థి ప్రాజెక్టులను మోడీ ఆదివారం ప్రకటించారు లేదా ప్రారంభించారు. అంతకుముందు మోడీ కంచి మఠం నిర్వహిస్తున్న ఆర్‌జె శంకర నేత్రాలయకు ప్రారంభోత్సవం చేశారు.