Monday, December 23, 2024

మందకృష్ణ మాదిగ.. నా చిన్న తమ్ముడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోని ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. విశ్వరూప మహాసభ వేదికపై మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టుకున్నారు. ఆయనను ప్రధాని భుజం తట్టి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో మాట్లాడి ప్రసంగం ప్రారంభించారు. సమ్మక్క, సారమ్మను గుర్తు చేసుకున్నారు. ఇది అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ అని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ.. నా చిన్న తమ్ముడు అన్నారు. తెలంగాణ మాదిగ సమాజానికి అభినందనలు తెలిపారు. ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారని ప్రధాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News