Monday, December 23, 2024

దృష్టిమళ్ళించేందుకేనా ‘అగ్నిపథ్’

- Advertisement -
- Advertisement -

కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కెటిఆర్
‘లంక’ అవినీతిని మరిపించే యత్నమా అని ప్రశ్న

KTR

మన తెలంగాణ/హైదరాబాద్ : సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని ట్విట్టర్లో ప్రశ్నించారు.

శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై మోడీ ఒత్తిడి తెర్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సిఇబి) ఛైర్మన్ ఎంఎంసి ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోడీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని బిజెపిని, ప్రధాని మోడీని కెటిఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News