Monday, January 27, 2025

అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత మోడీదే

- Advertisement -
- Advertisement -

పుస్తకాన్ని పట్టుకుని రాహుల్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగా న్ని అమలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బి జెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బిజెపి మనసా వాచా అంబేద్కర్ ఆలోచనలకి, రాజ్యాంగానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్స వ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జాతీయ పతాకా న్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రామ చందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని అవమానిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగ స్ఫూర్తి అర్థం కాదని, రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు నుండి ప్రతి ఇంటికి, ప్రతి బస్తీకి వెళి అంబేద్కర్, రాజ్యాంగం గొప్పదనాన్ని వివరించాలని అన్నారు. మన దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అన్న కిషన్‌రెడ్డి బిజెపి మనసా వాచా అంబేద్కర్ ఆలోచనలకి, రాజ్యాంగానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ సర్కారు ఏ ప్రభుత్వాన్నీ కూల్చలేదని అన్నారు. ఓట్ల కోసం మోడీ పథకాలు తీసుకురాలేదని పేర్కొన్నారు. గ్యారంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, మభ్య పెడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. బిజెపి ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ గొప్ప రాజ్యంగం అందించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News