ఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటనను మోడీ తీవ్రంగా ఖండించడంతో తన ట్విట్టర్‌లో విచారం వ్యక్తం చేశారు. ‘నా ఫ్రెండ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, త్వరగా కోలుకోవాలని’ మోడీ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావలేదని చెప్పారు. గాయపడిన ఆయన త్వరగా కోలుకొని మన ముందుకు రావాలన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో యుఎస్‌ఎ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ చేపడతుండగా ఆయనపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ చెవి నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. భద్రతా బలగాలు దుండగుడిపై కాల్పలు జరపడంతో హతమయ్యాడు. ఈ కాల్పుల్లో దుండగుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. ట్రంప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
నా ఫ్రెండ్‌పై కాల్పులు… ఖండిస్తున్నా: మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -