Saturday, December 21, 2024

మోడీజీ.. ఎన్నాళ్లు.. ఇంకెన్నేళ్లు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై మోడీ వివక్షను ఎండగడుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ టు- నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంలో మోడీ సర్కార్ నాన్చుడు ధోరణిపై ప్రజలు నిరసన తెలుపుతూ ఈ పోస్టర్లను అతికించారు. భారతమాల ప్రాజెక్టు కింద ఉప్పల -నారపల్లి ఫ్లైఓవర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. అయితే ఐదేళ్లు అయినా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.

ఇప్పటివరకు 40 శాతం వర్క్ కూడా పూర్తి కాలేదు. ఫ్లైఓవర్‌ ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విన్నవించుకున్నా స్పందన కరువైంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఫ్లైఓవర్ల నిర్మాణాలను పూర్తి చేస్తూ ఓపెనింగ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలా నాన్చుడు ధోరణి ప్రదర్శించడంతో జనాలు విసుగెత్తిపోయారు. దీంతో ఇలా పోస్టర్ల రూపంలో తమ నిరసనను తెలియచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News