Monday, December 23, 2024

మా బంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించం

- Advertisement -
- Advertisement -

హిందూ ప్రార్థనామందిరాలపై దాడుల అంశాన్ని
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో చర్చించిన ప్రధాని మోడీ

సిడ్నీ: ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.‘ ఆస్ట్రేలియాలో ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాల గురించి అల్బనీస్, నేను గతంలో చర్చించాం. ఇప్పుడు కూడా ఈ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది.

ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే చర్యలను మేము ఎంతమాత్రం సహించం. అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్బనీస్ మరోసారి హామీ ఇచ్చారు’ అని చరల అనంతరం అల్బనీస్ సమక్షంలో చేసిన మీడియా ప్రకటనలో మోడీ చెప్పారు. అలాగే ఇరువురు నేతలు తరచూ సమావేశం కావడంపైనా మోడీ స్పందించారు. ‘ గత ఏడాది కాలంలో మేం ఆరుసార్లు కలుసుకున్నాం. ఇది రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తోంది. క్రికెట్ భాషలో చెప్పాలంటే రెండుదేశాల సంబంధాలు టి20 మోడ్‌లోకి ప్రవేశించాయి’ అని మోడీ సరదాగా వాఖ్యానించారు. అల్బనీస్‌తో తన చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయన్న మోడీ ఆస్ట్రేలియాభారత్ సమగ్ర వూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడంపై తాము చర్చించినట్లు తెలిపారు.

అల్బనీస్‌కు ఆహ్వానం
కాగా ఈ ఏడాది భారత్‌లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్‌ను వీక్షించేందుకు అల్బనీస్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను ప్రధాని మోడీ ఆహ్మానించారు. అదే సమయంలో వైభవంగా జరిగే దీపావళి వేడుకలను కూడా వీక్షించవచ్చన్నారు. కాగా బెంగళూరులో కొత్త ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రధానంగా ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత డిజిటల్ ఎకానమీని, వినూత్నమైన పర్యావరణ వ్యవస్థతో అనుసంధానం చేయడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా అల్బనీస్ చెప్పారు. చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తల రాకపోకలకు వీలు కల్పించడంతో పాటుగా అక్రమ వలసలను అరికట్టే మైగ్రేషన్, మొబిలిటీ పార్టనర్‌షిప్ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News