Monday, December 23, 2024

ఎమ్మెల్యేపై ఐటి దాడులకు వ్యతిరేకంగా మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

- Advertisement -
- Advertisement -

భువనగిరి: భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై బుధవారం తెల్లవారుజామున ఐటి దాడులు చేయడాన్ని నిరసిస్తూ భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టి బొమ్మను జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ కేసిఆర్ మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, అలాగే భువనగిరిలో ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డి మరోసారి విజయం సాధిస్తారని, కుట్రపన్ని భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఐటి దాడులు చేపిస్తున్నారని వారు మండిపడ్డారు.

రానున్న రోజుల్లో ఎవ్వరు ఎన్ని కుట్రలు పన్నిన మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డి మూడోసారి విజయం సాధించి మంత్రి పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి పక్ష పార్టీల నేతలు ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేస్తున్నారో, భువనగిరి అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అందరు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలే సమాధానం చెబుతారని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి, గ్రంధాలయ చైర్మన్ జడల అమరేందర్, మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి,కౌన్సిలర్లు ఖాజా అజీమోద్దీన్, గోమారి సుధాకర్ రెడ్డి, కుశంగుల రాజు, మైనారిటీ నాయకులు ఇక్బాల్ చౌదరీ, ఇస్మాయిల్, లైక్ అహ్మద్ , అంజాద్ రహీం, అమిర్ అలీ, కాజమ్, మునీర్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News