Wednesday, January 22, 2025

మోడీ నోట 421 సార్లు మందిర్-మసీదు మాట: మల్లికార్జున్ ఖర్గే విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడగరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మందిర్-మసీదు, విచ్ఛిన్నకర అంశాల గురించి 421 సార్లు మాట్లాడారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం తెలిపారు. ఏడవ, చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగింపు రోజున ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గత 15 రోజుల తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పేరును 232 సార్లు, తన సొంత పేరును 758 సార్లు ప్రస్తావించారని, ఒక్కసారి కూడా నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావించలేదని చెప్పారు.

స్పష్టమైన మెజారిటీతో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, దేశానిక సమీకృత, జాతీయవాద ప్రభుత్వాన్ని అందచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ప్రజలు తీర్పు ఇస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతం అవుతుందన్న తమ అభిప్రాయానికి ప్రజలు కూడా ఆమోదించారని ఆయన తెలిపారు. రిచర్డ్ అటెన్‌బరో తీసిన చిత్రం తర్వాతే మహాత్మా గాంధీ పేరు ప్రపంచానికి తెలిసిందంటూ ప్రధాని మోడీ ఒక ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు. మహాత్ముని గురించి మోడీ చదివి ఉండకపోవచ్చునని, కాని ప్రపంచవ్యాప్తంగా గాంధీ గురించి అందరికీ తెలుసునని ఆయన చురకలు అంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News