Sunday, December 22, 2024

అచ్యుతాపురం ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారి రూ.50 వేల ఇస్తామని మోడీ ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో పైకప్పు కూలిపోయింది. ఫార్మా కంపెనీలో 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. భారీ పేలుడు జరగడంతో కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. ఓ మహిళా కార్మికులు శరీరంలోని పేగులు చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించాయి. పైకప్పు కూలిపోవడంతో మృతులు సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని పొక్లెయిన్ సహాయంతో శిథిలాలను తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News