Monday, December 23, 2024

సంపన్నులకు పన్ను పెంచాలనుకుంటున్న ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే;  ఆదాయ అసమానతలను తగ్గించే పేరుతో సంపన్నులకు మరింత పన్ను భారం మోపే అవకాశం ఉంది. బైజాంటైన్ మాతృక నిబంధనల స్థానంలో ప్రత్యక్ష పన్ను చట్టాలను సవరించడానికి మోడీ ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. అత్యధిక ఆదాయం ఉన్న వారికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచాలనుకుంటోంది. భారత దేశంలో ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. అయినప్పటికీ ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు.

దేశంలో 10 శాతం మంది వద్దే 77 శాతం జాతీయ సంపద ఉంది. కానీ 6 శాతం మందే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని ప్రభుత్వ డేటా తెలుపుతోంది. పేదల గౌరవాన్ని పెంచుతానని గద్దెనెక్కిన ప్రధాని ధనవంతులకే అనుకూలంగా ఉన్నారు. వస్తుసేవల పన్నని, అదని ఇదని పన్ను జిమ్మికులు చేస్తూ పోతున్నారు. ఏదిఏమైనప్పటికీ క్యాపిటల్ గెయిన్స్‌పై స్టాండర్డయిజ్డ్ టాక్స్ రేట్లను తేవాలని అనుకుంటున్నారు. భారత పన్ను విధానం ప్రపంచంలో ఎక్కడా లేనంత అయోమయంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News