Monday, December 23, 2024

మణిపూర్ ఘర్షణలు నివారించడంలో మోడీ విఫలం

- Advertisement -
- Advertisement -
ఓయూలో దిష్టిబొమ్మ దగ్దం చేసిన విద్యార్థి నాయకులు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌లో జరుగుతున్న తెగల ఘర్షణలను నివారించడంలో విఫలమైందని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ విమర్శించారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ప్రధాన మోడీ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ సర్కార్ దుర్మార్గపు పోకడలతో మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు, అత్యాచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మణిపూర్ లో జరుగుతున్న విధ్వంసాన్ని అదుపు చేసి, అక్కడ ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి,  సామూహిక అత్యాచారం చేసిన వ్యక్తులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. అత్యాచారానికి పాల్పడి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి నెల్లి సత్య, డీబీఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ దర్శన్, ఫిలాసఫీ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్, టీఆర్ ఎస్వీ ప్రధాన కార్యదర్శి రమేష్ ముదిరాజ్, పీడీఎస్‌యు ఓయూ కార్యదర్శి సుమంత్, ఎస్‌ఎస్‌యు విద్యార్థి నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

OU 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News