Monday, December 23, 2024

దేశంలో ఆకలి, పేదరికం అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం

- Advertisement -
- Advertisement -

దేశంలో ఆకలి, పేదరికం అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన తెలంగాణ/హై-దరాబాద్ : దేశంలో ఆకలి, పేదరికం ఆరికట్టడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బుధవారం సంఘ రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడున్నర సంవత్సరాలు అవుతున్నా దేశంలో ఆకలి, పేదరికంను అరికట్టడంలో పూర్తిగా విపలమైందని విమర్శించారు.

ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 107వ స్థానానికి నెట్టుబడిరదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి కల్పించి ఆర్ధికంగా ఆ వర్గాలను అభివృద్ధి చేయడానికి పార్లమెంటు లోపల, బయట అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని అనేక అంక్షలు పెట్టి నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామి పథకంకు నిధుల కోత విదించి పేదలకు అన్యాయం చేస్తూ కార్పోరేట్ సంస్థలకు కోట్లాది రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉండిగం చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ ఆదానీ, అంబానీలకు మోడీ ప్రభుత్వం దేశ సంపదను దోసిపెడుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో గ్రామణ పేద వ్యవసాయ కూలీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణతో వ్యవరిస్తుందన్నారు. తక్షణమే అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్, ఇండ్లస్థలాలు ఇవ్వాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నదన్నారు. వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాలమల్లేష్ ప్రసంగిస్తూ ఇంటి నిర్మాణం కొరకు ఇంటి స్థలం ఉన్న పేదలకు 6 లక్షలు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయకార్మికుల హక్కుల కోసం రానున్న కాలంలో ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు సుృజన్‌కుమార్, లింగారెడ్డి, అప్సర్, బుద్దుల జంగయ్య, తోటపల్లి శంకర్, వెంకన్న, ఏసయ్య, అక్కంపల్లి బాబు, శ్రావణ్‌కుమార్, నర్సింహా, కాసోజి మహాలక్ష్మీ, యాదమ్మ, రెసు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News