Monday, December 23, 2024

అదానీపై అదే దారి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోడీ గురువారం రాజ్యసభలో మరోసారి వారిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే ఈ రెండు సందర్భాల్లో ఆయన అదానీ ప్రస్తావన తీసుకురాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రా రంభమైన నాటి నుంచి ఉభయసభలలో తీవ్ర గందరగోళానికి కారణమైన అదానీ వ్యవహరంపై ఆయన గురువారం కూడా పెదవి విప్పలేదు.కాకపోతే విపక్షాలపై తీ వ్ర ఆరోపణలు చేశారు. గాంధీ, నెహ్రూ పై వ్యక్తిగత దాడికి దిగారు. అదానీ వ్యవహారంపై రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపిలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అడ్డుతగలడంపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఎంపిల భాష, ప్రవర్తిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్రపతి ప్ర సంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని గత కాం గ్రెస్ పాలనను ఎండగడుతూనే విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని ప్రసంగించడం ప్రా రంభించగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఇత ర ప్రతిపక్షాలకు చెందిన ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి ‘మోడీఅదానీ భాయ్‌భాయ్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు.

కొంతమంది ప్లకార్డులు ప్రదర్శిస్తూ అదానీపై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల నిరసల మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని ప్రతిపక్షాల తీరును ఎండట్టారు.‘ విపక్షాల తీరును చూస్తుంటే బాధేస్తుం ది. ఇలాంటి ముఖ్యమైన సభలో నినాదాలు చేయడం దురదృష్టకరం. ప్రజాసమస్యలపై చర్చించాలన్న ఆలోచన వా రికి లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపించాల్సిన కీలక సభలో ఇలా ప్రవర్తిస్తారా? మీరు ఎంతగా బురద విసిరేస్తే కమలం(బిజెపి గుర్తు) అంత గా వికసిస్తుంది. యుపిఎ ప్రభుత్వం ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం చూపలేదు. పైపై పూతలు మాత్రమే పూసింది. దేశ ప్రగతిని నాశనం చేసింది. చిన్నచిన్న దేశాలు పురోగమిస్తున్న సమయంలో ఆరు దశాబ్దాల కాలాన్ని మన దేశం కోల్పోయింది. పరిష్కారం చూపే వాళ్లను అడ్డుకోవడం మంచిపద్ధతి కాదు. ఎంత అడ్డుకున్నా ప్రజాసమస్యల పరిష్కారంలో మేం ఎంతమాత్రం వెనకడుగు వేయం. మా విధానాలతో దేశ ంలో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతున్నాం’ అని ప్రధాని అన్నారు. ‘ కీచడ్ ఉస్‌కే పాస్ థా, మేరే పాస్ గులాల్. జో జిస్‌కే పాస్ థా ఉస్నే దియా ఉచాల్’(వాళ్ల దగ్గర బురద ఉంది. నా దగ్గర గులాల్ ఉంది. ఎవరిదగ్గర ఏది ఉంటే వారు అది వెదజల్లుతారు) అంటూ విపక్షాలనుద్దేశించి మోడీ ఎద్దేవా చేశారు.

అసలైన లౌకికతత్వం ఏంటో చూపించాం

గత మూడునాలుగేళ్లలోనే 11 కోట్ల ఇళ్లకు తాగు నీరు అందించాం. 2014కు ముందు ఈ సంఖ్య 3 కోట్లుగా మాత్రమే ఉండేది. 2014 వరకు దేశంలో సగం మందికిపైగా ప్రజలకు బ్యాంకింగ్ సదుపాయమే లేదు. గత తొమ్మిదేళ్లలో 48 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిపిం చాం. గత కొన్నేళ్లుగా జన్‌ధన్ ఆధార్ మొబైల్ ట్రినిటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు 24 లక్షల కోట్లు పంపిణీ చేశాం.ఆజాదీ కా అమృత్‌కాల్ సమయంలో అందరికీ ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం కలిగేలా ప్రజల సంతృప్త స్థాయిలను అందుకునేలా పని చేస్తున్నాం. ఇదే నిజమైన సెక్యులరిజం.18 వేల గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపాం. దేశ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాం.

మారుమూల పల్లెలను అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ గత నాలుగు దశాబ్దాలుగా ‘ గరీబీ హఠావో ’ నినాదంతో కాలం వెళ్లదీసింది. మేము ఎ లాంటి వివక్షా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంశేమ ఫలాలను అందిస్తున్నాం’ అని మోడీ అన్నారు. ‘దేశం మా వెంటే ఉంది. దేశ ప్రజలు మమ్మల్నే విశ్వసిస్తున్నా రు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. వారిని ఎప్పటికప్పుడు శిక్షిస్తున్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో గతంలో పని చేసి ఉంటే గిరిజనులకోసం మేం ఇప్పుడు ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక, సామాజిక విధానాలన్నీ కూడా ఓటుబ్యాంకు రాజకీయాలపైనే అధారపడి ఉంటాయి’ అంటూ ప్రధాన ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.

గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం

తమ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాల సంక్షేమం చేపట్టిన పథకాలను ప్రధాని వివరించారు. ఆదివాసీలకోసం తొలిసారిగా ఐదు రెట్లు నిధులు ఖర్చు చేశాం. ఈ బడ్జెట్‌లో వారికోసం 1.20లక్షల కోట్లు కేటాయించాం. నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాం.అంతేకాకుండా వారి సాధికారత కోసం ప్రభుత్వం పని చేస్తోంది. ఏదో గాలివాటంలా కాకుండా .. మేం కష్టపడి పని చేసి శాస్త్ర, సాంకేతికత ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. కొవిడ్ కష్టకాలంలో టీకాలు అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపైనా కొందరు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. మన శాస్త్రవేత్తలు రూపొందించిన టీకాలు 150 దేశాల్లో ప్రజలను కాపాడాయి.

ప్రతిపక్షాలు సైన్స్‌కు, టెక్నాలజీకి వ్యతిరేకం. ఒకప్పుడు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే మన దేశం ఇప్పుడు మొబైళ్లను ఎగుమతి చేస్తోంది. రక్షణ రంగంలో భారత్ ఎగుమతులు ప్రస్తుతం రూ. లక్ష కోట్లకు పైగానే ఉన్నాయి. దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ఈ విభాగంలో కొత్త కంపెనీలు వస్తున్నాయి అని దాదాపు 90 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో ప్రధాని వివరించారు. రాజకీయ పార్టీలుభావితరాల బాలల జీవితాలతో ఆడుకోరాదని ఆయన హెచ్చరించారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు పాత పింఛను విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుండడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల మన పొరుగుదేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ప్రధాని ప్రసంగం అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీన్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News