Monday, December 23, 2024

5 వందే భారత్ రైళ్లకు ప్రధాని మోడీ పచ్చజెండా

- Advertisement -
- Advertisement -

భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ను సందర్శించి ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

నగరానికి చేరుకున్న ప్రధాని మోడీ నేరుగా రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను సందర్శించి ప్రత్యక్షంగా, వర్చువల్ పద్ధతిలో దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలిపే ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఒకే రోజు ఇన్ని వందే భారత్ రైళ్లు ప్రారంభం కావడం ఇదే ప్రథమం. మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు ఈ రైళ్లు నడుస్తాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రాణి కమలాపతి స్టేషన్ (భోపాల్) నుంచి జబల్ పూర్‌కు ఒక రైలు, ఖజురహో—భోపాల్ –ఇండోర్(మధ్యప్రదేశ్)కు మరో రైలు ప్రారంభించారు. అదేవిధంగా మడ్గావ్(గోవా)-ముంబై వందే భారత్, ధార్వాడ్-బెంగళూరు వందే భారత్, హటియా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించినట్లు ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News