Wednesday, January 22, 2025

విదేశాలకు పారిపోయినోళ్లంతా మోడీ దోస్తులే

- Advertisement -
- Advertisement -

Modi friends corrupted in India

దేశ సంపదను దోచుకొన్న విదేశాలకు పారిపోయిన వాళ్లంతా దోస్తులేనని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ఆర్ధిక నేరగాళ్లంతా ఆయనకు చుట్టాలేనని ఎద్దేవా చేశారు. మోడీ… ఇదేనా మీ దేశ భక్తి? అని ప్రశ్నించారు. అందుకే అంటున్నా ‘బిజెపి మస్ట్‌గో ’అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తరిమికొట్టకపోతే దేశం సర్వనాశనమవుతుందన్నారు. మోడీ హయాంలో దేశంలో నిరుద్యో గం బాగా పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపు కొడుతోందని ఆరోపించారు. మోడీ పాలనలో 33మంది ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలిపారిపోయారు. వారిప్పుడు లండన్లో జల్సాలు చేస్తున్నారన్నారు. వీరిలో చాలామంది గుజరాతీయులేనిని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి చిట్టా అంతా వస్తోందన్నారు. త్వరలోనే రఫేల్ కుంభకోణంపై సుప్రీంలో కేసు వేస్తామన్నారు. ఇడి, సిబిఐ, సిఐడి పేర్లు చెప్పి తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. వారికి దొం గలు భయపడతారేమో.. తానేందుకు భయపడతాను? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ గోల్‌మాల్ మాటలతో దేశ ప్ర జలను మభ్యపెడుతున్నారన్నారు. ఆయన వాజ్‌పేయి సి ద్ధాంతాలను ఎప్పుడో గంగలో కలిపేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News