Monday, December 23, 2024

అమెరికా నుంచి ఈజిప్టుకు మోడీ

- Advertisement -
- Advertisement -
ప్రధానికి ముస్తాఫా సాదరస్వాగతం
నేడు పలువురు మేధావులతో ఇష్టాగోష్టి

కైరో : భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. ఈజిప్టులో రెండు రోజుల పర్యటనలో ఉంటారు. అమెరికా పర్యటన ముగించుకు ని ఇక్కడికి చేరిన ప్రధాని మోడీకి విమానాశ్రయంలో ఈ జిప్టు ప్రధాని ముస్తాఫా మద్బౌలీ మోడీకి స్వాగతం పలికి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫతా ఎల్ సిసి ఇతర ప్రముఖులతో ప్రధా ని మోడీ పలు కీలక విషయాలపై చర్చిస్తారు. విమానాశ్రయంలో అంతకు ముందు ఇరుదేశాల జాతీయ గీతాలాపనల నడుమ సైనిక కవాతు మధ్య ఆయనకు ముబారక్ తెలిపారు. భారతీయ ప్రధాని ఒకరు ఈజిప్టుకు రావడం 26 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. ప్రధాని మోడీకి ఇదే తొలి ఈజిప్టు అధికారిక పర్యటన అయింది. రెండు దేశాల నడుమ వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన దోహదం చే స్తుందని అంతకు ముందు ప్రధాని మోడీ తెలిపారు. దేశాధ్యక్షులతో భేటీ , పాల్గొనబోయే కార్యక్రమాలపై ఆసక్తితో ఉన్నానని ప్రధాని ట్వీటు వెలువరించారు.

ఈజిప్టులోని భారతీయ సంతతికి చెందిన వారు కొందరు త్రివర్ణ పతాకాలు పట్టుకుని ప్రధాని మోడీకి కేరింతలతో స్వా గతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని శనివా రం రాత్రి బసచేసే స్థానిక హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోడీమోడీ, వందేమాతరం నినాదాలు చేశారు. చీర ధరించి వచ్చిన ఓ ఈజిప్టు మహిళ ప్రధాని మోడీకి అభివాదం చేశారు. షోలే సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగ్ పాట నేపథ్యంలో మార్మోగింది. ప్రధాని మోడీ ఈ యువతి వద్దకు వచ్చి భారతీయ సంప్రదాయపు చీర ధరించినందుకు అభినందించారు. నిన్ను ఈ విధంగా చూస్తూ ఉంటే నువ్వు భారతీయ మహిళవా, ఈ జిప్షియన్ మహిళవా అనేది ఎవరూ చెప్పలేరన్నారు. ఈ యువతి నవ్వుతూ తనకు హిందీ ఎక్కువ రాదని, భారతదేశం ఎప్పుడూ చూడలేదని, అయితే భారతీయ సంస్కృతి గురించి తెలుసునని తెలిపారు. ఇప్పటి నేపథ్యంలో ఈ దోస్తీ పాటను విన్పించానని చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం ఈజిప్టు అధ్యక్షులు ఎల్ సిసితో స మావేశం అవుతారు. ఈ తరువాత ఈజిప్టు ప్రధాని సారధ్యంలో ఈజిప్టు కేబినెట్‌కు చెందిన భారతీయ విభాగం తో జరిగే రౌండ్‌టేబుల్ చర్చలలో పాల్గొంటారు. ప్రధాని మోడీ తమ పర్యటనలో భాగంగా ఈజిప్టు ప్రధాన మతాధిపతి ముఫ్తి డాక్టర్ షావ్కీ ఇబ్రహీం అబ్దెల్ కరీం అల్లామ్‌శను కలుకుంటారు. ఈజిప్టు మేధావులతో ముచ్చటిస్తారు. ఆదివారమే ప్రధాని మోడీ 11వ శతాబ్దపు అల్ హకీమ్ మసీదును సందర్శిస్తారు. ఈ మసీదును దావూదీ బోహ్రా ముస్లిం తెగ ఆర్థిక సాయంతో పునర్మించారు. బో హ్రాలు ఇండియాలో కూడా ఎక్కువగా ఉన్నారు. ఆఫ్రికా, ఐరోపాలకు ఈజిప్టు గేట్‌వేగా ఉంది. అరబ్ దేశాల రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News