Wednesday, January 22, 2025

మోడీ మందకృష్ణకు కోట్టిచ్చి సభ పెట్టించారు : కెఎ. పాల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రధాని నరేంద్ర మోడీ కోటి రూపాయలిచ్చి సభ పెట్టించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ ఆరోపించారు. శనివారం మందకృష్ణ నిర్వహించిన మాదిగల విశ్వరూప సభకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతలు పాల్గొన్న విషయం విదితమే. దీనిపై కెఎ. పాల్ మాట్లాడుతూ క్రియాశీలంగా ఉన్న ప్రజాశాంతి పార్టీ… యాక్టీవ్ గా పనిచేయడం లేదంటూ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయని కెెెఎ. పాల్ చెప్పారు. సిఈఓ వికాస్ రాజ్, డిప్యూటీ సిఈఓ సత్యవాణి తమ ఉద్యోగాలు పోయినా పర్లేదు అని నిజాలు చెప్పారన్నారు. ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని లదాక్ ఎన్నికలు రద్దు చేశారని, నా పార్టీకి సింబల్ అండ్ ఇనాక్టివ్ చేసినందుకు కోర్టు లో పిటిషన్ వేస్తున్నానన్నారు. ‘డోంట్ ఓట్ ఆర్ ఓట్ నోట’ ట్యాగ్ తో ప్రజల్లోకి వెళ్తానన్నారు. అంబేద్కర్, గద్దర్ ఆశయాలను నెరవేర్చుకుందామన్నారు. ప్రజాశాంతి పార్టీ పోటీలో లేదు కాబట్టి ఎన్నికలను బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News