Wednesday, January 22, 2025

ప్రతి పౌరుడి నిత్య జీవనం ఆత్మనిర్భర్: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi gives a powerful message to the nation

ఢిల్లీ: ప్రకృతితో ముడిపడిన అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమృతకాలంలో పంచప్రాణాల సంకల్పం ప్రధాని ప్రతిపాదించారు. పంచప్రాణాలు అనగా వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల నుంచి విముక్తి కలగాలని పిలుపునిచ్చారు. నానో రసాయనిక ఎరువుల దిశగా భారత్ ముందడుగు వేయాలన్నారు. ఆత్మనిర్భర్ భారతంలో ప్రైవేటు రంగం కీలక భూమిక పోషిస్తుందని, ప్రపంచ ఆకాంక్షల సాకారంలో భారత్ ప్రధాన భూమిక పోషించాలని మోడీ ఆకాంక్షించారు. చట్టబద్ధ జీవనం, వ్యక్తిగత బాధ్యత ప్రతి పౌరుడిలో కనిపించాలని, ఇంటింటికీ విద్యుత్, ప్రతి చేనుకు నీరు అనేది ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యుత్, నీరు పొదుపు అన్నది ప్రజలందరి బాధ్యత అని, నవ సంకల్పంతో బాధ్యాయుతమైన భారత్‌ను నిర్మిద్దామని, అరవిందుడు చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకోవాలన్నారు.

ఆత్మ నిర్భర్ భారత్ అన్నది ఒక నినాదం కాదని, ఆత్మనిర్భర్ భారత్ ప్రభుత్వ విధానం కాదని, ఆత్మనిర్భర్ భారత్ అన్నది ప్రజాఉద్యమంగా సాగాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రతి పౌరుడి నిత్య జీవనం కావాలన్నారు. ఆత్మనిర్భర్ భారతంలో తొలిమెట్టు సైనిక సంపత్తి స్వదేశీకరణ అని, దేశంలో 300 పరికరాల తయారీకి సైన్యం సంకల్పించిందని, సైన్యం సంకల్పం మేరకు మనం నిరూపించుకోవాలని, సైన్యంతో పాటు యావత్ భారతం కలిసి నడవాలని మోడీ సూచించారు. మనం ఊహించనంత అతిపెద్ద మార్కెట్ ఆటవస్తువులు అని, పిల్లలాడే ప్రతి ఆట వస్తువు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగం కావాలని పిలుపునిచ్చారు. వందే భారత్ రైళ్లు, మెట్రో, సౌరవిద్యుత్ ఫలకాలు, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగం కావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News