Thursday, December 19, 2024

‘బయ్యారానికి మోడీ పాతర’.. దోస్త్ కోసం ‘తెలంగాణకు ద్రోహం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ బరి తెగించింది. మరోసారి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది. నమ్మించి ప్రజల గొంతు కోసింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే సంస్థల సేవలో తరించడమే తమకు అత్యంత ప్రధానమైనదని నిరూపించుకుంది. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం రాకుండా పాతర వేసింది. దీనికోసం తెరవెనుక నుంచి పెద్ద మంత్రాంగాన్నే కేంద్రం నడిపించింది. ఒక వ్యూహం ప్రకారం తెలంగాణకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా చేస్తూనే మిత్రుడైనా ఆదానీ గ్రూపునకు లబ్ధి చేకూర్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ఉక్కు కంపెనీని ఇవ్వకూడదన్న దురుద్దేశ్యంతోనే మోడీ ప్రభుత్వం బైలాడిల్లా నుంచి దక్షణి కొరియన్ కంపెనీ అయిన పాస్కోకు ఉక్కు సరఫరాకు అంగీకరించింది. ఆ సంస్థ ద్వారా ఆ దానీ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి రూ.37,500 కోట్ల మేర వ్యాపారం ఒప్పదం చేసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ ఒక్కటొక్కటిగా గాలిలో కలిసిపోతున్నాయి.

ఈ హామీలను నెరవేర్చుతామని అంటూనే కేంద్రం కాలాన్ని సాగదీసింది. తెలంగాణను నట్టేట ముంచింది. న రేంద్ర ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అడుగడుగునా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ నే ఉన్నారు. కేంద్రం చేసిన ఈ మోసంపై బిఆర్‌ఎస్ నేత క్రిషాంక్ వివరాణాత్మకంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బయ్యారంకు అవసరమైన బొగ్గు సరఫరాను చత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లా నుంచి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలను కేంద్రం పెడచెవిన పెట్టిన విషయాన్ని ఆయన కళ్ల కు కట్టినట్లుగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసి న విజ్ఞప్తులను తోసిపుచ్చిన కేంద్రం బైలాడిల్లా నుంచి ఇనుమును దక్షిణ కొరియన్ కంపెనీకి చెం దిన పాస్కోకు కేటాయిస్తూ ఒప్పందం చేసుకుంది. అదే సమయంలో ఆదానీ గ్రూపు ఎంటరై బైలాడి ల్లా గనులను సొంతం చేసుకున్నది. ఇందుకు మో డీ సంపూర్ణ సహకారాలు అందించారు. అక్కడితో ఆగకుండా పాస్కోతో స్టీల్ కంపెనీని ఏర్పాటు చే యడానికి రూ.37,500 కోట్లతో వ్యాపార దం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను క్రిషాంక్ తన ట్విట్టర్‌లో పొందుపొరిచారు.

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో బయ్యారంలో రూ.36 వేల కోట్ల వ్యయంతో ఒక భారీ ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతామని అప్పట్లో కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా రాష్ట్రానికి ఉక్కు కర్మాగారాన్ని మంజూరు చేయాలని పదేపదే కోరారు. కానీ దీనిపై కేంద్రం మొదటి నుంచి మొండిగానే వ్యవహరిస్తోంది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ చెబుతూ వచ్చింది. పార్లమెంట్‌తో సహా వివిధ వేదికలపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ప్రతిసారీ కేంద్రం ’నాన్‌ఫీజిబిలిటీ’ పేరుతో వక్రమార్గాలను అన్వేషించింది. తెలంగాణలో తగినంత ఖనిజ నిల్వలు లేవని, వాటి నాణ్యత 48 శాతానికి మించడం లేదంటూ కేంద్రం కొర్రీలు పెట్టింది. కానీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఇచ్చిన నివేదిక ప్రకారం సూమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయని వెల్లడించింది.

సరిపడ నాణ్యమైన నిల్వలు లేకపోవడమే ప్రధాన కారణం అయితే కేవలం 180 కిలోమీటర్ల స్వల్ప దూరంలోని చత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్ల్లాలో గనులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణా చేసేందుకు ఒక స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని కేంద్రానికి సూచించింది. రవాణా ఏర్పాటుకు అవసరమయ్యే వ్యయాన్ని తాము భరిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. కానీ కేంద్ర ఆధీనంలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌యండిసి) సంస్థ చత్తీస్‌గఢ్‌లో ఉన్న ఐరన్‌ఓర్ గనుల నుంచి బయ్యారం ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు 2016లోనే అంగీకరించింది. దీంతోపాటు మెటలర్జికల్ ఇంజినీరింగ్ కన్సల్ టెంట్స్ (మేకాన్) సంస్థ్ధ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్క్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అంశాలపైన కేంద్రానికి సానుకూల నివేదిక ఇచ్చింది. చివరకు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వీలు కాకుంటే, తాత్కాలికంగా పెల్లేటైజేషన్ ప్లాంట్ పెట్టి స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కేంద్రాన్ని కోరింది. అయినప్పటికీ కేంద్రం నుంచి తగు స్పందన రాలేదు.

వాస్తవానికి 1953 నుంచి జరిగిన ప్రతి సర్వేలో.. బయ్యారంలో నాణ్యమైన ఐరన్ ఓర్ ఉందనే చెబుతూ వచ్చాయి. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన ముడి సరుకు, వనరులు, నీటి సదుపాయం పుష్కలంగా ఉన్నాయనేది నిపుణులు పలుమార్లు తేల్చారు. దేశంలోని ఇనుప ఖనిజ నిల్వల్లో సుమారు 11 (సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నులు) శాతం బయ్యారంలోనే ఉందని పేర్కొన్నారు. దీని విలువ రూ.10 లక్షల కోట్లని అంచనా అని తెలిపారు. ఇక అక్కడికి దగ్గరలోనే మున్నేరు, బయ్యారం చెరవు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నీటి వసతికి కూడా ఢోకా ఉండదన్నారు. పక్కనే ఉన్న మదారం గ్రామం (కారేపల్లి మండలం)లో ప్లాంట్‌కు అవసరమైన డోలమైట్ నిక్షేపాలు కూడా విస్తారంగా ఉన్నాయని వెల్లడించారు. ఏటా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వి తీయగలిగినా కనీసం పాతికేళ్ల పాటు ఏలోటూ రానంత నిల్వ ఒక్క బయ్యారంలోనే ఉన్నట్టు తేల్చారు. దీంతోపాటు నేలకొండపల్లి, కారేపల్లి, భీమదేవరపల్లి, ములుగు, గూడూరు, గార్ల మండలాల్లోని అన్ని ప్రాంతాలతో కలిపితే సుమారు వంద కోట్ల టన్నుల మేర ఇనుప ఖనిజం ఉన్నట్టు కూడా గుర్తించారు. అయినప్పటికీ కేంద్రం కావాలనే ఈ నివేదికను మరుగుపరుస్తూ వచ్చింది.

ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్న మోడీ, ఆదానీల సంబందాలు
ఆదానీ, మోడీల మధ్య నెలకొన్న చీకటి వెలుగులు, రహస్య ఒప్పందాలు, కొనసాగుతున్న సంబంధాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరి దోస్తీపై మొదటి నుంచి ప్రతిపక్ష నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాటికి ఊతమిచ్చేలా ప్రస్తుతం అవి వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇటీవలే అదానీ గ్రూపులో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ బ్యాంకులు దొడ్డిదారిన పెట్టుబడులు పెట్టిన విషయం వెలుగుచూడగా, ప్రస్తుతం ఉక్కు కర్మాగారాన్ని కూడా అప్పగించింది.

ఇలా ఒక్కటేమిటి దేశంలోని మెజారిటీ ప్రాజెక్టులన్నీ కేంద్రం అదానీ గ్రూప్‌కే కట్టబెడుతున్నదన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుటి నుంచే అదానీ ఆస్తులు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రధాన మంత్రిగా కొనసాగుతుండడంతో ఆదానీ వ్యాపార సామ్రాజ్యం కూడా అంతే పెద్దఎత్తున విస్తరించిందని ‘బ్లూమ్‌బర్గ్’ అనే సంస్థ వెల్లడించింది విషయం తెలిసిందే. ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ పథకానికి అదానీ పిల్లర్‌గా మారారని కథనంలో వెల్లడించింది. బొగ్గు గనుల నుంచి మొదలుకుని మైనింగ్ వరకు, రైల్వేలైన్లు, రోడ్ల, ఎయిర్ పోర్టులతో అన్ని ఇప్పటికే అదానీ గ్రూపులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News