Monday, December 23, 2024

బిబిసిపై మోడీ సర్కార్ ప్రతీకారం: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: న్యూఢిల్లీ, ముంబైలోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) కార్యాలయాలలో పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు జరుపుతున్న సోదాలను ప్రతీకార చర్యగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. గుజరాత్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ రెండు భాగాల డాక్యుమెంటరీని విడుదల చేసిన బిబిసిపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.

దేశంలో అప్రకటిత ఎ్మర్జెన్సీని అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం విమర్శలకు భయపడిపోతోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మోడీ ప్రభుత్వ తీరును వినాశకాలే విపరీత బుద్ధి అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని తాము ఒకపక్క డిమాండు చేస్తుండగా ప్రభుత్వం మాత్రం బిబిసిని వేధిస్తోందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News