Sunday, December 22, 2024

ఆగస్టులో మోడీ ప్రభుత్వం కూలుతుంది: లాలూ ప్రసాద్ యాదవ్

- Advertisement -
- Advertisement -

పాట్నా: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆగస్టు నాటికి కూలిపోగలదని, కనుక ముందస్తు ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆర్జేడి చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం బలహీనంగా ఉందన్నారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపి పార్టీకి సొంత మెజార్టీ దక్కలేదన్నారు. ఎన్డీఏ కూటమి పక్షాల సహకారంతో మోడీ ప్రభుత్వం నెట్టుకొస్తోందన్నారు. లాలూ ప్రసాద్ ఇలా వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News