Thursday, December 26, 2024

బండి… మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఎక్కడ? : పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేనేత వస్త్రాలపై 5 శాతం జిఎస్ టిని మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి ఎంపి బండి సంజయ్ లేఖ రాసిన దానిపై మంత్రి పొన్న ప్రభాకర్ తన ట్విట్టర్ లో స్పందించారు. మొసలి కన్నీరు ఆపి మొదట కేంద్ర ప్రభుత్వ బాధ్యత నెరవేర్చాలని చురకలంటించారు. చేనేత కార్మికుల భారాన్ని తగ్గించాలని,  కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత బోర్డును పునరుద్ధరించాలని కోరారు. చేనేత కార్మికుల భీమాను, రాయితీలను తిరిగి ప్రారంభించాలని, సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రం ఎందుకు పెండింగ్ పెట్టిందో బండి సంజయ్ చెప్పాలని నిలదీశారు. మల్లా ఆడలేక పాత గజ్జెలు అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. ఎవరి సలహాలు అవసరం లేకుండా నరులకు నాగరికత నేర్పిన చేనేతను ఆదుకుని తీరుతామని పొన్నం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News