- Advertisement -
హైదరాబాద్: బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు దేశంలో అవకాశాలు ఉన్నాయని టిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. ఢిల్లీలో ఎంపి నామా మీడియాలో మాట్లాడారు. 13శాతం బియ్యాన్ని ఎగుమతులు చేస్తున్నారని, తెలంగాణ రైతులపై కేంద్రం ఎందుకు కక్ష కట్టిందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నామా హెచ్చరించారు. తెలంగాణ రైతులను ఎలా కాపాడుకోవాలో సిఎం కెసిఆర్‌కు తెలుసునన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని, రైతు పండించిన ప్రతి గింజను కొంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డే చెప్పారని, రైతులను వరి వేయాలని బిజెపి నాయకులు రెచ్చగొట్టారన్నారు.
- Advertisement -