- Advertisement -
హైదరాబాద్: మూడో సారి అధికారంలోకి బిఆర్‌ఎస్ రావడం ఖాయంగా కనిపిస్తోందని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బడుగుల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ప్రశంసించారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని బడుగుల పొగిడారు. తెలంగాణ పథకాలను మోడీ ప్రభుత్వం కాపీ కొడుతోందని చురకలంటించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి బిఆర్ఎస్ ను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -