Monday, December 23, 2024

ఆ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే

- Advertisement -
- Advertisement -

ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంతి నిర్మలా సీతారామన్ స్పష్టత

Modi govt decreased Fuel rate

న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో భాగంగా ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా పడే భారాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావం పడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి స్పష్టత ఇస్తూ ఆమె ఆదివారం ఓ ట్వీట్ చేశారు.‘పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకంలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌తో పాటుగా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ సెస్ కలిపి ఉంటాయి. తాజాగా తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్రాలతో పంచుకునేది కాదు. దీన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ( బిఇడి) మాత్రమే రాష్ట్రాలతో పంచుకో బడేది. మిగతావి ఏవీపంచుకోవు. కాబట్టి రాష్ట్రాలపై ప్రభావం చూపిందు’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News