- Advertisement -
హైదరాబాద్: ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అమలుపై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రభావంపై శాసన మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎగుమతులు ఉన్నాయని తెలిపారు. కేంద్రానికి లేని ఆంక్షలు రాష్ట్రాలపై ఎందుకని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఎందుకు ఇవ్వలేదని పల్లా ప్రశ్నించారు. తెలంగాణను ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
- Advertisement -