Monday, December 23, 2024

రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం రెడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తన డిమాండ్లను పరిష్కరించాలని రైతులు ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం చేపట్టడంతో వారితో మాట్లాడేందకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతులు పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించేటప్పుడు వారిపై పోలీసులు టియర్ గ్యాస్, బాష్పవాయువు ప్రయోగించారు. రైతులతో చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నామని, రైతులు ఆందోళన చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని రైతుల సంఘాలకు మంత్రి సూచించారు.

కేంద్రంతో గొడవ చేయడానికి తాము రాలేదని, రైతు సంఘం నాయకుడు సర్వణ్ సింగ్ పంథేర్ తెలిపారు. ఢిల్లీ చలో కార్యక్రమం పేరిట రైతులపై తప్పుడు అభిప్రయాలు కలుగజేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద మనసు చేసుకోని మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గాయపడిన రైతులతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు. రైతులపై పోలీసులు దాడిని ఖండిస్తున్నామని రాహుల్ తెలిపారన్నారు. మద్దతు ధర విషయంలో రైతులకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు. గతంలో మద్దతు ధర ఉత్పత్తి కంటే 50 శాతం ఎక్కువగా ఉండాలని కమిటీ సిపార్సు చేయడంతో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తిరస్కరించిన విషయాన్ని బిజెపి సభ్యుడు ప్రకాశ్ జావదేకర్ గుర్తు చేశారు. దీనికి సంబంధించిన లేఖను కూడా బయటపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News