Thursday, December 12, 2024

చట్టసభల్లో అదానీ ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో మోడీ, అదానీ ఒకటేనంటూ చిత్రాన్ని
ప్రదర్శించిన లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో
అసెంబ్లీ ఎదుట అదానీ, రేవంత్ భాయీ..భాయీ అనే నినాదంతో టీషర్టులు
ధరించినిరసనకు దిగిన బిఆర్‌ఎస్ సభ్యులు

న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష కాంగ్రెస్ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కూడా పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రధాని మోడీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ పాత్రధారులను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇంటర్వూ చేశారు. ఈ ఆందోళన ల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూ ర్,

సప్తగిరి శంకర్ ఉలక తమ ముఖాలకు మో డీ, అదానీ ఫొటోలున్న మాస్క్‌లు ధరించి వచ్చా రు. వారిద్దరినీ ఫొటో తీస్తూ ‘మీ ఇద్దరి మధ్య ఉ న్న బంధమేంటో చెప్పాలని’ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దానికి ఆ పాత్రధారులు “ఏం చేసినా మేం కలిసే చేశాం.. మాది ఏళ్లనాటి బంధం ” అని సమాధానమిచ్చా రు. మోడీ, అదానీ ఒక్కటేనని చెప్పే క్రమంలో విపక్ష పార్టీ ఇలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ ఎక్స్‌ఖాతాలో షే ర్ చేసింది.ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News