Saturday, February 1, 2025

కేంద్ర బడ్జెట్.. ఆ విషయంలో ఎపికే మేలు జరుగుతుంది: రామ్మోహన్ నాయుడు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభలో ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణంలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన అని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఎపికి మేలు జరుగుతుందన్నారు. ఎపికి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామని, ఎంత వీలైతే అంత మొత్తంలో ఎపికి నిధులు తెస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.  పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని, వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News