Thursday, November 21, 2024

తెలంగాణను ఆగం చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తుంది: శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం నిధులివ్వడంలేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. టిఆర్‌ఎస్ ముఖ్య నేతలపై ఇడి, ఐటి దాడులు చేస్తున్న నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.  ఐటి, ఇడి సంస్థలు బిజెపికి జేబు సంస్థలుగా పని చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కక్ష సాధింపుతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. తెలంగాణను ఆగం చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తుందని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. ఎంఎల్‌ఎలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికారని చురకలంటించారు. బిజెపి బెదిరింపు దాడులకు తెలంగాణ ప్రజలు భయపడరని హెచ్చరించారు. ముంబయి, గోవాల్లో క్యాసినోలు మూసి వేయాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News