హైదరాబాద్: నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. కెఆర్‌ఎంబి చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ, ఎపి నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నీటి వాటా ఖరారు అంశాన్ని ట్రైబ్యునల్‌కు నివేదించామన్నారు. కేంద్ర తొమ్మిదేళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదని విమర్శించారు. తాత్కాలిక సర్దుబాటు 66.34 శాతం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. 811 టిఎంసిల్లో చెరో సగం కేటాయించాల్సిందేనని రజత్ కుమార్ స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమ, గోదావరి జిలాల మళ్లింపులో తమకెందుకు వాటా ఇవ్వరని అడిగారు. అప్పర్ భద్రకు కూడా జాతీయ హోదా ఇచ్చారని తెలంగాణకు కూడా ఓ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపు బోర్డు బడ్జెట్‌పై చర్చ జరిగింది. గెజిట్ నోటిఫికేషన్, హిందీ అమలు, ఎపికి కార్యాలయం తరలింపు, జల విద్యుదుత్పత్తి, తాగునీటి లెక్కింపు, ఆర్‌డిఎస్‌పై చర్చ జరిగింది. వరద సమయంలో నటి లెక్కింపు ప్రాజెక్టుల అనుమతి, బోర్డు సమావేశంలో నాగార్జునసాగర్ ఎడమ కాలవ నష్టంపై కూడా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో రజత్ కుమార్, మురళీధర్, శశిభూషణ్ కుమార్, నారాయణ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.
Also Read: పదో తరగతి ఫలితాలు విడుదల