Sunday, February 23, 2025

ఎరువుల కొరత కేంద్రం పాపం !

- Advertisement -
- Advertisement -

కేంద్రం నుంచి తగ్గిన ఎరువుల సరఫరా
8.54 లక్షల మెట్రిక్ టన్నలకు గాను 6.73 లక్షల సరఫరా
సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రామగుండం ఫెర్టిలైజర్స్ ప్లాంట్
25 రోజుల పాటు నిలిచిన యూరియా ఉత్పత్తి

మన తెలంగాణ / హైదరాబాద్: రైతన్నలు ఎరువుల కోసం తండ్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ మేరకు ఎరువులు అందుబాటులో లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన మేరకు ఎరువుల సరఫరా కాకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవసరాల మేరకు ఎరువులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోగా ఆశించిన ఎరువుల సరఫరాలో నిరాశే ఎదురవుతున్నది. ఎరువుల కోసం రైతులు క్యూ కడుతున్నారు. సకాలంలో ఎరువులు అందక పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంటాడుతున్న కొరత తీవ్రత

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఎరువుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం ప్రస్తుత కొరతకు కారణమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కేంద్రం నుంచి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు కేంద్రం నుంచి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఇచ్చింది. అయితే కేవలం 6.73 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం నుంచి సరఫరా అయ్యింది.

తగ్గిన రామగుండం ఉత్పత్తి

కేంద్రం నుంచి ఎరువుల దిగుబడి తగ్గుముఖం పట్టడానికి రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం ఉత్పత్తి గత పది నెలలుగా గణనీయంగా తగ్గడమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కేంద్రం నిర్లక్షం కారణంగా రామగుండం ఫెర్టిలైజర్స్ తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల తరచుగా ప్లాంట్ షట్ డౌన్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్యాస్ పైప్ లైన్ల లీకేజీల వల్ల దాదాపు నెల రోజుల పాటు రామగుండం ఫెర్టిలైజర్స్ ప్లాంట్ షట్ డౌన్ చేసినట్లు తెలిసింది. గ్యాస్ లీకేజి సమస్య కారణంగా ఎరువుల ఉత్పత్తికి అంతరాయం కలిగి ప్లాంట్ నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం చేరుకోలేకపోతున్నట్లు తెలుస్తున్నది.

వినతులు పట్టించుకోని కేంద్రం

ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తరచూ విజ్ఞప్తి చేస్తోంది. సీజన్ ఆరంభములో కేంద్రం ధృష్టికి తీసుకువెళ్లగా రాష్ట్ర అవసరాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు సరఫరా చేసే బాధ్యత తమదని కేంద్రం భరోసా ఇస్తూ వస్తున్నది. అయినప్పటికీ ప్రస్తుత ఫిబ్రవరి నెలలోనే రావాల్సిన ఎరువుల కోటాలో 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా సరఫరా కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News